Saitej: సాయితేజ్ కి సవాల్ విసిరే పాత్రలో రమ్యకృష్ణ!

Ramyakrishna powerfull role in Republic movie

  • ఐఏఎస్ పాత్రలో సాయితేజ్
  • పొలిటికల్ లీడర్ గా రమ్యకృష్ణ
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు    

సాయితేజ్ కథానాయకుడిగా దేవ కట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్' సినిమా రూపొందింది. భగవాన్ - పుల్లారావు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో సాయితేజ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక రమ్యకృష్ణ రాజకీయ నాయకురాలుగా నటించింది. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. రాజకీయ నాయకులకు బాధ్యత ఎక్కువ అని రమ్యకృష్ణ .. ప్రభుత్వ అధికారులకు అంతకు మించిన బాధ్యత ఉంటుందని సాయితేజ్ వ్యవహరించే తీరు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

అంటే ఈ సినిమాలో సాయితేజ్ - రమ్యకృష్ణ మధ్య వార్ బలంగా నడుస్తుందని చెబుతున్నారు. అహంభావంతో కూడిన అధికారానికి .. బాధ్యతతో కూడిన అధికారానికి మధ్య జరిగే పోరాటం చుట్టూ ఈ కథ నడుస్తుందన్న మాట. సాయితేజ్ జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటించగా, ముఖ్యమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. మరి ఈ సినిమా థియేటర్స్ కి వస్తుందా? ఓటీటీకి వెళుతుందా? అనేది చూడాలి.  

Saitej
Aishwarya Rajesh
Ramyakrishna
Jagapathi Babu
  • Loading...

More Telugu News