Sumanth: సుమంత్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

- కొత్త దర్శకుడితో సుమంత్
- పూజా కార్యక్రమాలు పూర్తి
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
- సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
సుమంత్ చాలా కాలంగా తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. జయాపజయాల సంగతి అటుంచితే, సాధ్యమైనంత వరకూ కొత్త కథలతోనే ప్రేక్షకుల ముందుకు వెళ్లడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. 'ఇదమ్ జగత్' .. 'కపటధారి' సినిమాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తాయి. తాజాగా ఆయన మరో ప్రాజెక్టుతో పట్టాలపైకి వెళ్లాడు. కీర్తికుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
