Telangana: హరితహారం.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్యక్రమం: కేటీఆర్​

KTR Launches 7th Phase Haritha Haaram

  • రాష్ట్రంలో పచ్చదనం 28 శాతానికి పెరిగింది
  • ఏడో విడత హరితహారాన్ని ప్రారంభించిన మంత్రి
  • పెద్ద అంబర్ పేటలో అర్బన్ పార్కు ప్రారంభం

హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం 23.4 నుంచి 28 శాతానికి పెరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 220 కోట్ల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు రూ.5,900 కోట్లు కేటాయించామని మంత్రి చెప్పారు. ఏడో విడత హరితహారం కార్యక్రమం సందర్భంగా రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట కలాన్ వద్ద ఆయన అర్బన్ పార్కును ప్రారంభించారు. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.

హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో 129 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేశామని కేటీఆర్ చెప్పారు. హెచ్ఎండీఏ పరిధిలోనే 59 పార్కులను నెలకొల్పామని, అందుకు రూ.650 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్యక్రమం హరితహారం అని చెప్పారు.

దాన్ని మించిన గొప్ప కార్యక్రమం లేదని, భవిష్యత్ లో భూమిని కాపాడుకునేందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎందరో ఆక్సిజన్ అందక ప్రాణాలు విడిచారని, ప్రాణవాయువును అందించడంలో అర్బన్ పార్కులు ఎంతో కీలకపాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News