Venkaiah Naidu: ఉప రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడికి జన్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన‌ కేసీఆర్, చంద్ర‌బాబు, సోము వీర్రాజు

birth day wishes to venkaiah naidu

  • ఆయ‌న‌ సేవలు రేపటి తరానికి ఆదర్శం కావాలి: కేసీఆర్
  • నిండు నూరేళ్లు మీరు భరతమాత సేవలో తరించాలి: సోము
  • తెలుగుదనానికి నిండైన రూపం: చ‌ంద్ర‌బాబు

ఉప రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు నేడు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. 'ఉప రాష్ట్రపతి శ్రీ వెంక‌య్య నాయుడు గారికి సీఎం శ్రీ కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హుందాతనంతో సమాజం, దేశం పట్ల అంకితభావంతో ఆయన చేస్తున్న సేవలు రేపటి తరానికి ఆదర్శం కావాలని, వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని సీఎం భగవంతుడిని ప్రార్థించారు' అని తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సీఎంవో పేర్కొంది.

'ఆత్మీయులు, భారత ఉపరాష్ట్రపతి వెంక‌య్య నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదనానికి నిండైన రూపంగా భాసిల్లుతూ.. ఏ స్థాయిలో ఉన్నా తెలుగువారి శ్రేయస్సుకు, తెలుగు భాష అభివృద్ధికీ కృషిచేసే మీరు, సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను' అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు.  

'గౌరవ భారత ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ వెంక‌య్య నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కొన్ని దశాబ్దాలుగా దేశాభివృద్ధికి, దేశ ప్రజల సంక్షేమానికి మీరు ఎంతగానో కృషి చేస్తున్నారు. మీరు మంచి ఆరోగ్యంతో, నిండు నూరేళ్ళు భరతమాత సేవలో తరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను' అని బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ట్వీట్ చేశారు.

Venkaiah Naidu
BJP
Somu Veerraju
Chandrababu
KCR
  • Loading...

More Telugu News