Hyundai: చెన్నైలోని హ్యుండాయ్ ప్లాంట్ అరుదైన ఘనత.. కోటి కార్ల ఉత్పత్తి!

Hyundai Chennai plant produced ten millionth car
  • పాతికేళ్ల కిందట చెన్నైలో హ్యుండాయ్ ప్లాంట్
  • తయారీ రంగంలో దూసుకెళుతున్న ప్లాంట్
  • చెన్నై ప్లాంట్ పై హ్యుండాయ్ 4 బిలియన్ డాలర్ల పెట్టుబడి
  • ప్లాంట్ లో 15 వేల మంది సిబ్బంది
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుండాయ్ భారత్ లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది. తాజాగా చెన్నైలోని హ్యుండాయ్ ప్లాంట్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు కోటి కార్లను ఉత్పత్తి చేసింది. తాజాగా ఈ ప్లాంట్ లో 100 లక్షలవ కారును ఉత్పత్తి చేశారు. ఇది ఓ అల్కజార్ మోడల్ వాహనం. ఈ కారును తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆవిష్కరించారు.

చెన్నైలోని హ్యుండాయ్ వాహన తయారీ ప్లాంట్ ను 25 ఏళ్ల కిందట స్థాపించారు. ఈ క్రమంలో పాతికేళ్లయిన సందర్భంగా హ్యుండాయ్ వేడుకలు జరుపుకుంటోంది. అదే సమయంలో కోటి కార్ల ఉత్పత్తి పూర్తి కావడం సంస్థ ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. హ్యుండాయ్ సంస్థ తన చెన్నై ప్లాంట్ పై 4 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం ఇక్కడ 15 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
Hyundai
Chennai
10 Millionth Car
Alcazar
MK Stalin
India

More Telugu News