Venkatesh Daggubati: 'నారప్ప'కి లైన్ క్లియర్ .. వచ్చేనెలలోనే రిలీజ్?

Venkatesh new movies update

  • 'అసురన్' రీమేక్ గా 'నారప్ప'
  • అమెజాన్ ప్రైమ్ కి అమ్మకం 
  • వచ్చేనెల 24వ తేదీన విడుదల 
  • హాట్ స్టార్ కి 'దృశ్యం 2'
  • ఆగస్టులో రిలీజ్ చేసే అవకాశం 

వెంకటేశ్ వరుస సినిమాలతో తన జోరును కొనసాగిస్తూనే ఉన్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ లు పడుతున్నా, పకడ్బందీగా ఆయన తన సినిమాలు ప్లాన్ చేసుకుంటూ వెళుతూనే ఉన్నారు. అలా ఆయన చాలా తక్కువ సమయంలో 'నారప్ప' .. 'దృశ్యం 2' సినిమాలను పూర్తిచేశారు. 'నారప్ప' .. తమిళ సినిమా 'అసురన్'కి రీమేక్ అయితే, 'దృశ్యం 2' మలయాళ సినిమాకి రీమేక్. ఈ రెండు సినిమాలు సంచలన విజయాలను నమోదు చేసినవే. అలాంటి ఈ రెండు సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి రానున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే 'నారప్ప' ఓటీటీలో రావడమనేది ఖరారైపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వారికి మంచి రేటుకు ఈ సినిమాను అమ్మినట్టుగా చెబుతున్నారు. జులై 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారని అంటున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఇక 'దృశ్యం 2' సినిమాను హాట్ స్టార్ వారు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆగస్టులో ఈ సినిమాను వదిలే ఆలోచనలో ఉన్నట్టుగా చెబుతున్నారు. నెల తేడాతోనే వెంకటేశ్ సినిమాలు రెండూ పలకరిస్తూ ఉండటం విశేషమే.

Venkatesh Daggubati
Priyamani
Srikanth Addala
  • Loading...

More Telugu News