Andhra Pradesh: బ్యాడ్మింటన్​ అకాడమీ కోసం సింధుకు రెండెకరాల స్థలం

AP CM Jagan Best Wishes For Olympians
  • విశాఖలో కేటాయించిన ప్రభుత్వం
  • ఒలింపిక్స్ కు వెళ్లే క్రీడాకారులకు అభినందనలు
  • ఒక్కొక్కరికి రూ.5 లక్షలు అందజేత
టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వెళ్లే క్రీడాకారులను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. బ్యాడ్మింటన్ ప్లేయర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, హాకీ క్రీడాకారిణి ఎటిమర్పు రజనిలకు ఆయన అభినందనలు చెప్పారు.

రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలను తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎంవో ప్రకటనను విడుదల చేసింది. మరింత మంది క్రీడాకారులకు అవకాశం కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. అందులో భాగంగా విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు కోసం పి.వి. సింధుకు 2 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.
Andhra Pradesh
PV Sindhu
Satwik Sai Raj
Rajani Etimarpu
Olympics

More Telugu News