Dilip Kumar: దిలీప్ కుమార్ కు మరోసారి అస్వస్థత

Dilip Kumar taken to hospital again

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
  • హిందుజా ఆసుపత్రి ఐసీయూలో దిలీప్ కుమార్
  • దిలీప్ వయసు 98 సంవత్సరాలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ముంబైలోని హిందుజా హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నారు. ఇటీవలే ఇదే సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరారు. రెండు వారాల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

అయితే మరోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. దిలీప్ కుమార్ వయసు 98 సంవత్సరాలు. వయసు ఎక్కువ కావడంతో ముందస్తు జాగ్రత్తగా ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.

Dilip Kumar
Bollywood
  • Loading...

More Telugu News