Mandira Bedi: మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ కన్నుమూత

Actress Mandira Bedis husband Raj Kaushal Dead

  • తెల్లవారుజామున 4.30 గంటలకు మృతి
  • గుండెపోటుకు గురైన రాజ్ కౌశల్
  • విషాదంలో మునిగిపోయిన బాలీవుడ్

బాలీవుడ్ నటి మందిరా బేడీ భర్త, సినీ నిర్మాత రాజ్ కౌశల్ మృతి చెందారు. ఈ విషయాన్ని మరో నిర్మాత ఒనిర్ వెల్లడించారు. ఈ తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో గుండెపోటుతో ఆయన తమ నివాసంలోనే మరణించారని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. రాజ్ కౌశల్, మందిరాబేడీ దంపతులకు కొడుకు వీర్, కుమార్తె తార ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News