Venkatesh Daggubati: సెన్సార్ పూర్తి చేసుకున్న 'నారప్ప'

Narappa Completed its Sensor

  • 'నారప్ప'గా విభిన్నమైన పాత్రలో వెంకీ
  • తమిళ 'అసురన్'కి రీమేక్
  • ముఖ్యమైన పాత్రలో ప్రకాశ్ రాజ్
  • థియేటర్లలోనే విడుదల అంటూ టాక్  

వెంకటేశ్ కథానాయకుడిగా 'నారప్ప' సినిమా రూపొందింది. తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన 'అసురన్' సినిమాకి ఇది రీమేక్. అక్కడ ఆ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ధనుశ్ కెరియర్లోనే వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది. భారీ వసూళ్లతోపాటు ప్రశంసలను కూడా తెచ్చిపెట్టింది. దాంతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. సురేశ్ బాబు .. కలైపులి థాను ఈ సినిమాను నిర్మించారు.తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. అసలు ఈ పాటికే ఈ సినిమా విడుదల కావలసింది. అయితే కరోనా వలన పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విడుదల చేయలేదు. ఇక ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తుందనే టాక్ ఒక వైపున వినిపిస్తుంటే, లేదు థియేటర్లకే వస్తుందని మరికొంతమంది అంటున్నారు. వెంకటేశ్ భార్య పాత్రలో ప్రియమణి నటించగా, ప్రకాశ్ రాజ్ .. సంపత్ రాజ్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Venkatesh Daggubati
Priyamani
Prakash Raj
Sampath Raj
  • Loading...

More Telugu News