Madhu: పోలవరం నిర్వాసితులకు నెలకు రూ. 7,500 చెల్లించాలి: సీపీఎం నేత మధు

Stop Polavaram Projetct works says CPM Madhu

  • నిర్వాసితులకు పునరావాసం పూర్తయ్యేంత వరకు ప్రాజెక్టు పనులను ఆపేయాలి
  • ముంపు గ్రామాలన్నింటికీ ఒకేసారి పునరావాసం కల్పించాలి
  • కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి

పోలవరం నిర్వాసితులకు పునరావాసం పూర్తయ్యేంత వరకు ప్రాజెక్టు పనులను ఆపేయాలని సీపీఎం నేత మధు డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పరిహారం కోసం రావాలసిన నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. 1986 నాటి వరద ముంపు లెక్కల ప్రకారం ముంపు గ్రామాలన్నింటికీ ఒకేసారి పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజల సహకారం తీసుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మధు అన్నారు.

జులై నుంచి డిసెంబర్ నెల వరకు ముంపుకు గురయ్యే ప్రతి కుటుంబానికి నెలకు రూ. 7,500 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొండలు, గుట్టలపై నివాసాలు ఏర్పరుచుకున్నవారికి మంచినీరు, ఆహారం, మందులు, టార్పాలిన్లు ఇవ్వాలని చెప్పారు. నిర్వాసితుల సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తామని తెలిపారు. నిర్వాసితులను తక్షణమే ఆదుకోవాలని... లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News