Rakul Preet Singh: ఓటీటీ కోసం విష్వక్సేన్ తో రకుల్!

Vishwak Sen with Rakul Preeth Singh

  • ఓటీటీకి పెరుగుతున్న ఆదరణ 
  • కథానాయికలకు అవకాశాలు
  • ఆ దిశగా రకుల్ అడుగులు 
  • ఎ.ఎల్. విజయ్ నుంచి వచ్చిన ఛాన్స్  

ఇదివరకు కథానాయికలు ఒక సినిమా తరువాత మరో సినిమాలో అవకాశం వస్తే తేలికగా ఊపిరి పీల్చుకునేవారు. సినిమా ఫీల్డ్ లో గ్యాప్ రాకుండా చూసుకోవడం అన్నిటికంటే ముఖ్యమైన విషయం కనుక, ఒక రేంజ్ వాళ్లు టెన్షన్ పడేవారు. ఇక ఇప్పుడు సినిమా అవకాశాలు కాస్త లేట్ గా వచ్చిన ఫరవాలేదు .. ఓటీటీలు ఉన్నాయి కదా అని తాపీగా ఉన్నారు. చాలామంది కథానాయికలు ఇప్పుడు ఓటీటీ సినిమాలతో .. వెబ్ సిరీస్ లతో తీరిక లేకుండా ఉన్నారు. వెబ్ సిరీస్ లు చిన్న చిన్న కథలుగా రూపొందుతుండటం మరింత మంది ఆర్టిస్టులకు అవకాశాన్ని ఇస్తోంది.

ఓటీటీ కోసం ప్రస్తుతం 'అక్టోబర్ 31 .. లేడీస్ నైట్' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఆంథాలజీ ఫిల్మ్ కి ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నారు. మిగతా కథానాయికలతో పోల్చుకుంటే ఈ రూట్లో రకుల్ కాస్త ఆలస్యంగానే అడుగుపెట్టింది. విష్వక్సేన్ ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు. అతని పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. అలాగే రకుల్ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఓటీటీ రూట్లో రకుల్ బిజీ అవుతుందేమో చూడాలి.

Rakul Preet Singh
Vishwak Sen
A L Vijay
  • Loading...

More Telugu News