Kurnool District: కర్నూలు జిల్లాలో మహిళా కూలీకి వజ్రం.. రూ. 6 లక్షలకు కొనుగోలు చేసిన వ్యాపారి

woman worker found Rs 6 lakh diamond in farmland
  • టమాటా నారు నాటుతుండగా దొరికిన వజ్రం
  • కొనుగోలు చేసిన స్థానిక వ్యాపారి
  • ఇటీవల ఓ రైతుకు దొరికిన రూ. 1.25 కోట్ల విలువైన వజ్రం
కర్నూలు జిల్లాలోని పొలాల్లో వజ్రాల వేట కొనసాగుతోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడి పొలాలు జాతరను తలపిస్తాయి. స్థానికులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ వజ్రాల వేటలో మునిగి తేలుతుంటారు. జిల్లాలోని జొన్నగిరిలో నిన్న ఓ మహిళా కూలీకి ఖరీదైన వజ్రం లభించింది.

టమాటా నారు నాటుతున్న కూలీ చేతికి చిక్కిన ఈ వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ. 6 లక్షలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. జొన్నగిరిలో ఇటీవల ఓ రైతుకు దొరికిన వజ్రం రూ. 1.25 కోట్లకు అమ్ముడుపోయింది. కాగా, జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, పెరవలి ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. గతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ తవ్వకాలు జరిపేవారు. ఇప్పుడు స్థానికులే ఆ పని చేస్తున్నారు.
Kurnool District
Diamond
Farm Land
Jonnagiri

More Telugu News