Monal Gujjar: హైదరాబాద్ లో ఇంటిని కొన్న మోనాల్ గుజ్జర్!

Monal Gujjar buys a Home in Hyderabad

  • బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మోనాల్
  • ఇక నేను పక్కా హైదరాబాదీనే
  • కొద్ది మందిని ఆహ్వానించి గృహ ప్రవేశం

గుజరాతీ భామ, టాలీవుడ్ బిగ్ బాస్ నాలుగో సీజన్ లో పోటీదారుగా పాల్గొని, వీక్షకులకు దగ్గరైన మోనాల్ గుజ్జర్ హైదరాబాద్ లో ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ ను ఇటీవల కొనుగోలు చేసింది. తెలుగులో వెబ్ సిరీస్ లతో పాటు, టీవీ షోలతో బిజీగా ఉన్న మోనాల్, ఇకపై తాను పక్కా హైదరాబాదీని అయిపోయానని, ఇక్కడే ఎక్కువ కాలం ఉంటానని పేర్కొంది.

"గత రెండు నెలలుగా నేను ఓ మంచి ఇంటి కోసం చూశాను. ఇటీవల ఆన్ లైన్ లో వెతుకుతుంటే కనిపించిన ఇంటిపై మనసు పారేసుకున్నాను. వెంటనే దాన్ని కొనేశాను. ఇక నేను హైదరాబాదీనే" అని మోనాల్ వ్యాఖ్యానించింది. కాగా, ఈ ఇంటి గృహప్రవేశం 21వ తేదీన జరిగినట్టు తెలిపిన ఆమె, ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామని, కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించామని చెప్పింది. నిదానంగా అందరినీ పిలుస్తానని చెప్పుకొచ్చింది.

తాను ఇంతవరకూ తెలుగు ప్రాజెక్టులు చేస్తూ, అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ కు వచ్చి పోతూ ఉన్నానని, దీంతో బాగా అలసిపోతున్నానని చెప్పిన ఆమె, అవకాశాలు కూడా పెరిగాయని, ఈ కారణంతోనే ఇంటిని కొన్నానని తెలిపింది. త్వరలోనే తన కుటుంబాన్ని కూడా ఇక్కడికే తీసుకుని వస్తానని తెలిపింది.

Monal Gujjar
House
Own House
Hyderabad
  • Loading...

More Telugu News