Centra Government: డీఏ, డీఆర్​ పెంపు ఉత్తర్వులపై కేంద్రం స్పష్టత

Center Clarifies over DA and DR Hike

  • డీఏ, డీఆర్ పై సోషల్ మీడియాలో పుకార్లు
  • పెంచుతున్నట్టు నకిలీ ఉత్తర్వుల హల్ చల్
  • అది నకిలీదని ప్రకటించిన ఆర్థిక శాఖ

జులై నుంచి కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛనుదారులకు కరవు ఉపశమనాన్ని (డీఆర్) పునరుద్ధరిస్తున్నట్టు ఓ ఉత్తర్వు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే, ఆ ఉత్తర్వులపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. అది నకిలీ అని వివరణ ఇచ్చింది. అలాంటి జీవోను ఇవ్వలేదని స్పష్టం చేసింది.

‘‘సోషల్ మీడియాలో ఓ డాక్యుమెంట్ చక్కర్లు కొడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పింఛన్ దారులకు డీఆర్ ను పునరుద్ధరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ, అది నకిలీది’’ అని ట్వీట్ చేసింది. 50 లక్షల మంది ఉద్యోగులు, 61 లక్షల మంది పింఛనుదారులకు డీఏ పెంపును గత ఏడాది ఏప్రిల్ లో కేంద్ర ప్రభుత్వం హోల్డ్ లో పెట్టింది. మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 30 వరకు పెంపును ఆపింది. ఈ నేపథ్యంలోనే ఆ ఉత్తర్వు హల్ చల్ చేస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News