Jammu And Kashmir: జమ్ము ఎయిర్‌పోర్టు టెక్నిక‌ల్ ఏరియాలో పేలుళ్ల క‌ల‌క‌లం.. వైస్‌ ఎయిర్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ హెచ్‌ఎస్‌ అరోరాతో మాట్లాడిన రాజ్‌నాథ్‌!

blasts in jammu airport

  • ఈ రోజు తెల్ల‌వారు జామున ఘ‌ట‌న‌
  • ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు
  • ఎయిర్‌పోర్టులోని ఓ భవనం పైకప్పు ధ్వంసం
  • ఉగ్రవాదుల చ‌ర్యేనా అన్న కోణంలోనూ ద‌ర్యాప్తు  

జమ్ము ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఫోర్స్ నిర్వ‌హ‌ణ‌లో ఉండే టెక్నిక‌ల్ ఏరియాలో ఈ రోజు తెల్ల‌వారు జామున‌ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయి. దీంతో ఎయిర్‌పోర్టులోని ఓ భవనం పైకప్పు దెబ్బతింది. దీనిపై సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్‌, ఫోరెన్సిక్ నిపుణులు ఎయిర్‌పోర్టు వ‌ద్ద‌కు చేరుకుని తనిఖీలు చేస్తున్నాయి. అలాగే, స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు ఎయిర్ పోర్టు ప‌రిస‌రాల్లో త‌నిఖీలు చేస్తున్నారు.

ఇది ఉగ్రవాదుల చ‌ర్యేనా అన్న కోణంలోనూ ద‌ర్యాప్తు చేస్తున్నారు.  ఎన్‌ఐఏ, ఎన్ఎస్‌జీ బలగాలు కూడా ఎయిర్‌పోర్టు వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఎయిర్‌పోర్టులో పేలుళ్ల‌పై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ స్పందించి,  వైస్‌ ఎయిర్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ హెచ్‌ఎస్‌ అరోరాతో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. ఎయిర్‌ మార్షల్‌ విక్రమ్ సింగ్ ఎయిర్‌పోర్టు వ‌ద్ద‌కు వెళ్లి అక్క‌డి ప‌రిస్థితిని తెలుసుకోనున్నారు.

Jammu And Kashmir
Raj Nath Singh
airport
  • Loading...

More Telugu News