YS Sharmila: వైఎస్సార్ ను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు: షర్మిల వార్నింగ్

Sharmila alleged CM KCR insults YSR

  • టీఆర్ఎస్ నేతలపై షర్మిల ఆగ్రహం
  • వైఎస్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదని వెల్లడి
  • వైఎస్ గొప్పదనం అందరికీ తెలుసని ఉద్ఘాటన
  • లక్షలాది అభిమానులు తిరగబడతారని హెచ్చరిక

సీఎం కేసీఆర్ సహా, టీఆర్ఎస్ నేతలు మహానేత వైఎస్సార్ ను కించపరిచేలా మాట్లాడుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదని ఆమె స్పష్టం చేశారు. వైఎస్సార్ గురించి, ఆయన గొప్పదనం గురించి తెలుగు ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఆరోగ్యశ్రీ సృష్టికర్త వైఎస్సారేనని, అది మంచి పథకం కాబట్టే టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని తొలగించలేదని షర్మిల పేర్కొన్నారు.

"మంచి పథకాన్ని తొలగించే ధైర్యం మీకు లేదు. వైఎస్సార్ గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. మరోసారి చెబుతున్నా... వైఎస్సార్ మహానేత, మనసున్న నేత. మీలాగా కాదు... వైఎస్సార్ నిజమైన ప్రజల నేత. మరోసారి వైఎస్సార్ ను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. కేసీఆర్, టీఆర్ఎస్... ఖబడ్దార్! వైఎస్సార్ ను అవమానించేలా మాట్లాడితే లక్షల్లో ఉన్న ఆయన అభిమానులు తిరగబడతారు" అని షర్మిల హెచ్చరించారు.

YS Sharmila
CM KCR
YSR
TRS
Telangana
  • Loading...

More Telugu News