Narendra Modi: అయోధ్య భారత సంప్రదాయాలకు సర్వోన్నత ప్రతీకలా నిలవాలి: ప్రధాని మోదీ ఆకాంక్ష

Modi says Ayodhya should manifest utmost Indian traditions

  • అయోధ్యలో రామమందిరం నిర్మాణం
  • అయోధ్య అభివృద్ధిపై మోదీ సమీక్ష
  • హాజరైన యూపీ సీఎం
  • అధికారులకు మోదీ దిశానిర్దేశం

రామమందిరం నిర్మితమవుతున్న అయోధ్య నగరం అభివృద్ధి ప్రణాళికపై ప్రధాని నరేంద్ర మోదీ నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ, అయోధ్య భారత సంస్కృతి, సంప్రదయాలకు సర్వోన్నత ప్రతీకలా నిలవాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా, అభివృద్ధి దిశగా మన దార్శనికతను అత్యుత్తమ స్థాయిలో చాటేలా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఇవాళ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు.

ప్రతి భారతీయుడిలో అంతర్లీనంగా ఉండే సాంస్కృతిక స్పృహను పుణికిపుచ్చుకున్న నగరం అయోధ్య అని ప్రధాని మోదీ అభివర్ణించారు. అయోధ్య ఆధ్యాత్మిక నగరం మాత్రమే కాదని, ఆత్మ పరివేష్టితమైన నగరం అని పేర్కొన్నారు. భవిష్యత్ లో అయోధ్య ఎలా ఉండబోతోందన్న విషయం ప్రజల మనోభావాలతో సరిపోలాలి అని పేర్కొన్నారు.

ఇది పర్యాటకులు, భక్తులకు ఉపయుక్తంగా ఉండాలి అని మోదీ నిర్దేశించారు. కనీసం జీవితంలో ఒక్కసారైనా అయోధ్యను సందర్శించాలని భవిష్యత్ తరాలు బలంగా కోరుకులా అయోధ్యను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. నైపుణ్యవంతులైన యువత సేవలను నగరాభివృద్ధిలో ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు.

  • Loading...

More Telugu News