Dhanush: 'రంగ్ దే' దర్శకుడితో ధనుశ్?

Dhanush movie with Venky Atluri

  • తమిళంలో బిజీగా ధనుశ్
  • ఈ సారి లవ్ స్టోరీ పై దృష్టి
  • తెరపై వెంకీ అట్లూరి పేరు
  • అధికారిక ప్రకటనతోనే సందేహాలకు తెర  

తమిళనాట ధనుశ్ కి మంచి క్రేజ్ ఉంది. విభిన్నమైన .. విలక్షణమైన కథలకు ప్రాధాన్యతను ఇచ్చే కథానాయకుడిగా మంచి పేరు ఉంది. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుని, వాటిని ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో ధనుశ్ సక్సెస్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా ఒక తెలుగు సినిమాలో చేయనున్నాడనే వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తాను ఓ సినిమా చేయనుండటం నిజమేనని ధనుశ్ కూడా ధ్రువీకరించాడు.

అయితే శేఖర్ కమ్ముల కంటే ముందుగా మరో తెలుగు డైరెక్టర్ తో ధనుశ్ ఒక సినిమా చేయనున్నాడనే టాక్ రీసెంట్ గా వినిపించింది. ఆ దర్శకుడు ఎవరబ్బా? అనే సందేహానికి సమాధానాన్ని వెతికి పట్టుకునే పనిలోనే చాలామంది ఉన్నారు. ఆ ప్రశ్నకి సమాధానంగా ఇప్పుడు వెంకీ అట్లూరి పేరు వినిపిస్తోంది. ఇంతవరకూ ఆయన ప్రేమకథలను మాత్రమే తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ఆయనతో ధనుశ్ చేయనున్న సినిమా కూడా లవ్ స్టోరీనే అని అంటున్నారు. ఇటీవల యాక్షన్ .. ఎమోషన్ కథలు ఎక్కువగా చేస్తూ వచ్చిన ధనుశ్, ఈ సారి లవ్ స్టోరీనే ఎంచుకున్నాడని చెబుతున్నారు. ఇది కూడా అధికారిక ప్రకటన వస్తేనే నిజమనుకోవాలి.

Dhanush
Sekhar Kammula
Venky Kudumula
  • Loading...

More Telugu News