Director Shankar: క్రికెటర్ తో తమిళ సినీ దర్శకుడు శంకర్ కూతురు పెళ్లి

Director Shankars daughter to marry cricketer

  • రోహిత్ దామోదరన్ తో శంకర్ కుమార్తె ఐశ్వర్య పెళ్లి 
  • వృత్తి రీత్యా డాక్టర్ అయిన ఐశ్వర్య 
  • కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా జరగనున్న వివాహం

దక్షిణాదిలో అగ్ర సినీ దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్న శంకర్ కుమార్తె ఐశ్వర్య పెళ్లిపీటలు ఎక్కబోతోంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో ఆమె వివాహం జరగబోతోంది. శంకర్ కుమార్తె ఐశ్వర్య వృత్తి రీత్యా డాక్టర్. రోహిత్ దామోదరన్ తండ్రి దామోదరన్ పారిశ్రామికవేత్త. అంతేకాదు మధురై పాంథర్స్ టీమ్ జట్టుకు స్పాన్సర్ కూడా.

కరోనా నేపథ్యంలో వీరి వివాహాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. మహాబలిపురంలో ఈ వివాహం జరగనుంది. కేవలం దగ్గర బంధువులు, అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే వివాహానికి హాజరుకానున్నారు. ఈ ఏడాది మే నెలలో శంకర్ తల్లి కన్నుమూశారు. ఈ విషాదం తర్వాత శంకర్ ఇంట్లో జరుగుతున్న తొలి శుభకార్యం ఇదే.

ప్రస్తుతం కమల్ హాసన్ తో 'ఇండియన్-2' సినిమాను శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ తో ఒక పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అంతేకాదు బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో 'అపరిచితుడు' సినిమాను రీమేక్ చేయబోతున్నారు.

Director Shankar
Daughter
Marriage
Tollywood
Kollywood
  • Loading...

More Telugu News