Acharya Movie: 12 రోజుల్లో ముగియనున్న ‘ఆచార్య’ షూటింగ్

Acharya movie to finish shooting in 12 days
  • చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం
  • పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్తున్న సినిమా
  • విడుదల తేదీపై ఇంకా రాని క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ ఎండింగ్ స్టేజికి వచ్చింది. మరో 12 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. వాస్తవానికి కరోనా నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్ కు ఆటంకం కలిగింది. కరోనా ఇబ్బందులు లేకపోతే ముందస్తు ప్రణాళిక ప్రకారం మే 13న విడుదల అయ్యేది. తాజాగా కొరటాల శివ స్పందిస్తూ షూటింగ్ కేవలం 12 రోజులు మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. అయితే సినిమాను ఎప్పుడు విడుదల చేయబోతున్నారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.

మరోవైపు సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నట్టు కొరటాల శివ ప్రకటించారు. దీనికి వివరణను కూడా ఆయన ఇచ్చారు. 'ఆచార్య' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాను వెంటనే ప్రారంభించాల్సిన పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. ఈ సినిమాల ప్రీ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తాను చాలా బిజీగా ఉన్నానని... అందువల్ల సోషల్ మీడియాకు సమయాన్ని కేటాయించలేకపోతున్నానని అన్నారు. అయితే మీడియా ద్వారా సినీ అభిమానులకు అందుబాటులో ఉంటానని చెప్పారు.
Acharya Movie
Shooting
Updates
Chiranjeevi
Koratala Siva

More Telugu News