Teja Sajja: 'హనుమాన్' మూవీ షూటింగ్ ప్రారంభం!

- తేజ సజ్జ హీరోగా 'హనుమాన్'
- దర్శకుడిగా ప్రశాంత్ వర్మ
- పూజా కార్యక్రమాలు పూర్తి
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
మొదటి నుంచి కూడా ప్రశాంత్ వర్మ విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. చిన్న సినిమాలనే కాదు ... భారీ బడ్జెట్ చిత్రాలను కూడా తెరకెక్కించగలనని నిరూపించుకున్నాడు. ఇటీవలే తాను ' హనుమాన్' సినిమాను చేయనున్నట్టు ప్రకటించాడు. దాంతో అందరిలోను ఆసక్తి మొదలైంది. ఈ సినిమాలో కథానాయకుడిగా తేజ సజ్జ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి .. ఆ తరువాత అది నిజమేననే విషయం స్పష్టమైంది. కరోనా ప్రభావం తగ్గడంతో, కొంతసేపటి క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
