Jio: సెప్టెంబరులో జియో నుంచి అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్... ఫీచర్లు ఇవిగో!

- నేడు ఆర్ఐఎల్ సర్వసభ్య సమావేశం
- చవకైన స్మార్ట్ ఫోన్ ప్రకటన
- సెప్టెంబరు 10 నుంచి అందుబాటులోకి ఫోన్
- జియో కోసం గూగుల్ ప్రత్యేకమైన ఓఎస్
భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన రిలయన్స్ జియో అతి తక్కువ ధరకు లభ్యమయ్యే స్మార్ట్ ఫోన్ ను తీసుకువస్తోంది. దీని పేరు జియో ఫోన్ నెక్ట్స్. ఇంతకుముందు జియో ఫోన్ పేరిట ఫీచర్ ఫోన్ తీసుకువచ్చిన రిలయన్స్ ఇప్పుడు పూర్తిస్థాయి స్మార్ట్ ఫోన్ తో రంగంలోకి దిగుతోంది. ఈ ఏడాది సెప్టెంబరులో వినాయకచవితి సందర్భంగా దీన్ని మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 10 నుంచి జియో ఫోన్ నెక్ట్స్ అందుబాటులోకి వస్తుందని రిలయన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ స్మార్ట్ ఫోన్ వివరాలను తెలిపారు.
