KTR: పల్లె ఆణిముత్యం.. ఆమె పాటకు ఫిదా అయిపోయిన కేటీఆర్​, దేవిశ్రీ, తమన్​

Min KTR Mesmerized With Young Talent

  • శ్రావణి పాటను కేటీఆర్ కు ట్వీట్ చేసిన వ్యక్తి
  • నిజమైన ట్యాలెంట్ అంటూ తమన్, దేవిలకు ట్యాగ్
  • అవకాశాలిస్తానన్న దేవిశ్రీ ప్రసాద్

తెలంగాణలోని మారుమూల పల్లెకు చెందిన ఓ యువతి పాట మంత్రి కేటీఆర్ ను ఆకట్టుకుంది. సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, ఎస్.ఎస్. తమన్ లూ ఆమె పాటకు ముగ్ధులయ్యారు. మెదక్ జిల్లా నారైంగి అనే గ్రామానికి చెందిన శ్రావణి పాడిన జానపద గేయం వారందరినీ కట్టిపడేసింది మరి. సురేంద్ర తిప్పరాజు అనే ఓ నెటిజన్ ఆమె పాటను వీడియో తీసి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు.

‘‘ఈ అమ్మాయి పేరు శ్రావణి. తండ్రి పేరు లక్ష్మణ చారి. ఊరు మెదక్ జిల్లాలోని నారైంగి. ఓ పనికోసం ఊరికెళ్తే ఈ ఆణిముత్యాన్ని చూశాను. చాలా బాగా పాడుతోంది. ఆమె గాత్రం అద్భుతం. ఈ ట్యాలెంట్ ను ప్రోత్సహించేందుకు మీ మద్దతు, ఆశీర్వాదం కావాలి’’ అని పేర్కొంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు.

ఆ పాటను విన్న కేటీఆర్.. 'నిజంగా ట్యాలెంటెడ్' అంటూ తమన్, దేవిశ్రీలను ట్యాగ్ చేశారు. వారు కూడా ఆ పాటను విన్నారు. నిజంగా ఆమె ట్యాలెంట్ అద్భుతమంటూ దేవిశ్రీ ట్వీట్ చేశారు. ఇంత మంచి ట్యాలెంట్ ఉన్న అమ్మాయిని తమకు పరిచయం చేసినందుకు థాంక్యూ అంటూ కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

తాను ఇప్పటికే ప్రపంచం చూడని ఇలాంటి వాళ్లకోసమే వెతుకుతున్నానని, కచ్చితంగా శ్రావణికి అవకాశాలిస్తానని హామీ ఇచ్చారు. స్టార్ టు రాక్ స్టార్ లో ఆమెతో పాడిస్తానని, ఆమె ట్యాలెంట్ ను అందరికీ పరిచయం చేస్తానని చెప్పారు. ఇక, 'ఆమె బంగారం' అంటూ తమన్ ట్వీట్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News