Bandi Sanjay: కేసీఆర్ నీ పతనం ప్రారంభమైంది.. నీపై దాడులు చేసే రోజు వస్తుంది: బండి సంజయ్

KCR downfall started says Bandi Sanjay
  • కేసీఆర్ డైరెక్షన్ లో టీఆర్ఎస్ గూండాలు దాడి చేస్తున్నారు
  • ఓయూ జేఏసీ విద్యార్థి సురేశ్ యాదవ్ పై రెండో సారి దాడి జరిగింది
  • ఈ దాడిని కేసీఆర్ ఎందుకు ఖండించలేదు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రాక్షసుడని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులపై కేసీఆర్ డైరెక్షన్ లో టీఆర్ఎస్ గూండాలు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నీ పతనం ప్రారంభమైంది.. నీపై దాడులు చేసే రోజు వస్తుందని అన్నారు. మంచి చేయాలని చెబితే, ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూ జేఏసీ విద్యార్థి సురేశ్ యాదవ్ ని ఈరోజు బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రోడ్లపై బరితెగించి దాడులు జరుగుతుంటే కాపాడాల్సిన ప్రభుత్వమే శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తోందని సంజయ్ విమర్శించారు. సురేశ్ యాదవ్ పై రెండో సారి దాడి జరిగిందని అన్నారు. ప్రజలందరూ చూస్తుండగా 20 మంది గూండాలు దాడి చేశారని చెప్పారు. ఈ దాడిని కేసీఆర్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. హాస్పిటల్ కి వెళ్తే చికిత్స కూడా చేయలేదని అన్నారు. సురేశ్ యాదవ్ పై దాడి చేసిన వారిపై సెక్షన్ 307 కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సురేశ్ కుటుంబ సభ్యులను మాటలతో వేధించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
Bandi Sanjay
BJP
KCR
TRS
Suresh Yadav
OU JAC

More Telugu News