Chiranjeevi: దసరా దిశగా 'ఆచార్య' అడుగులు!

- ముగింపు దశలో 'ఆచార్య'
- వచ్చేనెలలో చివరి షెడ్యూల్
- 20 రోజుల్లో షూటింగు పూర్తి
- దసరాకి థియేటర్ల దగ్గర సందడి
చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' రూపొందుతోంది. దాదాపు ఈ సినిమా షూటింగు చివరిదశకు వచ్చేసింది. ఓ సింగిల్ షెడ్యూల్లో షూటింగు పార్టును పూర్తిచేయాలని చూస్తున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నారు. జులై మొదటివారంలో ఈ షెడ్యూల్ ను మొదలుపెట్టి, 20 రోజుల్లో చిత్రీకరణను పూర్తిచేస్తారట. ఈ షెడ్యూల్లో చిరంజీవి .. చరణ్ తదితరులు పాల్గొంటారని అంటున్నారు. ఆగస్టులో మిగతా కార్యక్రమాలను పూర్తిచేసి, దసరాకి విడుదల చేయలనే ఆలోచనలో ఉన్నారట.
