Mumbai: పిల్లాడు అల్లరి చేస్తున్నాడంటూ పొరుగువారి వేధింపులు.. కొడుకు సహా 12వ అంతస్తు నుంచి దూకేసిన మహిళ

Women Jumped Off From 12th Floor of Her Apartment in Mumbai

  • ఇటీవలే కరోనాతో భర్త మృతి 
  • ఆయూబ్ ఖాన్ కుటుంబం వేధింపులు 
  • కేసు నమోదు.. ఒకరి అరెస్ట్   

కొన్నాళ్ల క్రితమే ఆమె భర్త కరోనాకు బలయ్యారు. ‘నీ కొడుకు అల్లరోడు.. భరించలేకపోతున్నాం’ అంటూ పొరుగువారు పెట్టిన వేధింపులు భరించలేక ఇప్పుడు ఏడేళ్ల కుమారుడు సహా ఆమె ఆత్మహత్య చేసుకుంది. 12వ అంతస్తు నుంచి దూకేసింది. ఈ విషాద ఘటన ముంబైలో జరిగింది.

మరణించిన మహిళను రేష్మ ట్రెంచిల్ (44)గా పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మహత్య లేఖ ఆధారంగా పోలీసులు 33 ఏళ్ల యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆమె భర్త శరత్ మూలుకుట్ల కరోనా బారిన పడ్డారు. వారణాసిలోని కరోనా సోకిన తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారి బాగోగులు చూసుకున్నాడు శరత్. అతడి తల్లిదండ్రులిద్దరూ కరోనాతో చనిపోయారు. ఆ తర్వాత కరోనా బారిన పడిన శరత్ కూడా మే 23న ప్రాణాలు విడిచాడు.

అప్పటి నుంచి రేష్మ చాందివిలీలోని తన ఫ్లాట్ లో ఏడేళ్ల కుమారుడితో ఉంటోంది. అయితే, వారి కొడుకు చాలా అల్లరివాడని, కొంటె పనులు ఎక్కువగా చేస్తున్నాడని పొరుగున ఉన్న ఆయూబ్ ఖాన్ (67), అరవై ఏళ్ల అతడి భార్య, అతడి కొడుకు షాదాబ్ లు వేధించడం మొదలుపెట్టారు. అప్పటికే భర్త పోయిన బాధలో ఉన్న ఆమె.. వారి వేధింపులతో మరింత కుంగిపోయారు. తమ అపార్ట్ మెంట్ పై నుంచే దూకి ప్రాణం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News