'అఖండ' కోసం భారీ యాక్షన్ ఎపిసోడ్!
- కరోనా కారణంగా ఆగిన 'అఖండ'
- వచ్చేనెల నుంచి మళ్లీ సెట్స్ పైకి
- ప్రత్యేకమైన పాత్రలో పూర్ణ
- దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్
తాజా షెడ్యూల్లో బాలకృష్ణ తదితరులపై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారట. జులై మొదటివారం నుంచి హైదరాబాద్ శివార్లలో ఈ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని అంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని చెబుతున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ తో చాలావరకూ చిత్రీకరణ పూర్తవుతుందని అంటున్నారు. అధికారికంగా చెప్పకపోయినా, దసరాకి ఈ సినిమా విడుదలవుతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, పూర్ణ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది.