Adilabad District: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం.. ప్రసాదం తీసుకెళ్లిన బాలికపై స్వామీజీ అత్యాచారం

Swamiji Raped girl in Adilabad dist arrested

  • నేరేడిగొండ మండలం రాజూరలో ఘటన
  • గదిలో స్పృహ కోల్పోయిన స్థితిలో బాలిక
  • నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు 

ప్రసాదాన్ని ఇచ్చేందుకు వెళ్లిన బాలికపై ఓ స్వామీజీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం రాజూరలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఆత్మారాం మహారాజ్ అనే సాధువు రాజూర సమీపంలోని కొండపైనున్న శివాలయంలో ఉండేవాడు. రెండేళ్ల క్రితం అక్కడికి సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో వున్న ఆలయానికి వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో సమీప గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక స్వామీజీకి నీళ్లు, ప్రసాదం తీసుకుని వెళ్లింది.

అలా వెళ్లిన బాలిక సమయం గడుస్తున్నా ఇంటికి చేరకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ సాధువు కనిపించకపోవడంతో పక్కనే ఉన్న నివాసం వద్దకు వెళ్లారు. దాని తలుపులు లోపలి నుంచి పెట్టి ఉండడంతో అనుమానంతో బద్దలుగొట్టి లోపలికి వెళ్లి చూడగా బాలిక స్పృహ కోల్పోయి ఉంది. బాలిక ద్వారా అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Adilabad District
Rape Case
Crime News
girl
  • Loading...

More Telugu News