vaccination: దేశవ్యాప్తంగా ఒక్కరోజే 80 లక్షల కరోనా టీకా డోసుల పంపిణీ!

69 lakh doses have been administered acrros india in a single day

  • దేశవ్యాప్తంగా ప్రారంభమైన సార్వత్రిక వ్యాక్సినేషన్‌
  • ఒక్కరోజు వ్యవధిలో ఇదే అత్యధికం
  • ఇప్పటి వరకు 28.7 కోట్ల డోసుల పంపిణీ
  • 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్‌

దేశవ్యాప్తంగా సోమవారం నుంచి సార్వత్రిక వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. తొలిరోజే ఎన్నడూ లేనంతంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఈరోజు సాయంత్రానికి 80 లక్షల టీకాలను పంపిణీ చేసినట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 28.7 కోట్ల డోసులు పంపిణీ చేశారు.

నేటి నుంచి కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచిత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. గతంలో రాష్ట్రాలే టీకాలు సమకూర్చుకోవాలని తెలిపిన ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తయారీ సంస్థల నుంచి 75 శాతం టీకాలను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. మిగిలిన 25 శాతం టీకాలను ప్రైవేటు సంస్థలకు విక్రయించేందుకు తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

రాష్ట్రాలే టీకాలు సమకూర్చుకోవాలన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం తిరిగి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పైగా పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా విక్రయించేందుకు నిరాకరించాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో టీకాల కొరత ఏర్పడి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది.

  • Loading...

More Telugu News