Srinivas Goud: తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కేసీఆర్ కోరుకుంటే, ఏపీ పాలకులు గొడవకు సిద్ధమవుతున్నారు: శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud slams AP Govt over irrigation issues

  • ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు
  • ఘాటు వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి అనిల్
  • బదులిచ్చిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్
  • ఏపీ తమకు అన్యాయం చేస్తోందని వెల్లడి
  • చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఏపీనే నిబంధనలు అతిక్రమిస్తోందని ఆరోపించారు. ట్రైబ్యునల్, ఎన్జీటీ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ధిక్కరిస్తోందని అన్నారు. టెలిమెట్రీలు ధ్వంసం చేసి ఏపీ అక్రమంగా నీరు తీసుకుంటోందని వెల్లడించారు. ఏపీ మాకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోం అని స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే సీఎం కేసీఆర్ కోరుకున్నారని, కానీ ఏపీ పాలకులు మాత్రం తమతో గొడవకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. కృష్ణా జలాలను ఎక్కడో ఉన్న నెల్లూరు జిల్లాకు తరలించాలని చూస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. నదీ పరీవాహకంలో లేని జిల్లాలకు కృష్ణా జలాలు కావాలా? నది పక్కనే ఉన్న పాలమూరు ప్రజలకు కృష్ణా జలాలు అవసరం లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News