Junior NTR: త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా ఆగిపోలేదట!

Trivikram and Ntr combo movie is seen soon

  • త్రివిక్రమ్ తో సెట్ పైకి వెళ్లాలనుకున్న ఎన్టీఆర్
  • కొన్ని కారణాల వలన ఆగిన ప్రాజెక్టు
  • వెసులుబాటు కోసమే ప్రాజెక్టుల మార్పు
  • త్వరలోనే మరోసారి సెట్స్ పైకి    

త్రివిక్రమ్ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందని ఆమధ్య చెప్పారు. ఈ సినిమాకి 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను సెట్ చేశారు. రాజకీయాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అన్నారు. దాంతో అందరిలో ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అయితే హఠాత్తుగా ఈ ప్రాజెక్టు పక్కకి వెళ్లిపోయింది. ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను కొరటాలతో సెట్ చేసుకుంటే, త్రివిక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్టును మహేశ్ బాబుతో ప్లాన్ చేసుకున్నాడు. దాంతో ఏం జరిగిందో తెలియని అయోమయానికి అభిమానులు లోనయ్యారు.

త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం కూడా జరిగింది. అందువల్లనే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పుకున్నారు. కానీ ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తెలుస్తోంది. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా ఆగిపోలేదట. ఇద్దరూ కూడా ఒక వెసులుబాటు కోసం ప్రస్తుతానికి మాత్రమే ఈ ప్రాజెక్టును పక్కకి పెట్టారని అంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తిచేసిన తరువాత, త్రివిక్రమ్ ప్రాజెక్టుపైకి ఎన్టీఆర్ వెళ్లనున్నాడని చెబుతున్నారు. 'అరవింద సమేత' హిట్ తరువాత ఈ కాంబినేషన్లో మరో సినిమా రానుండటం అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయమే.

Junior NTR
Trivikram Srinivas
Tollywood
  • Loading...

More Telugu News