Vighnesh Shivan: నయనతారలో ఆ లక్షణమే విఘ్నేశ్ కి నచ్చిందట!

Vignesh Shivan likes Nayanatara selfconfidence

  • సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే కథ
  • అంధురాలిగా నయనతార
  • నిర్మాతగా విఘ్నేశ్ శివన్
  • త్వరలోనే విడుదల

నయనతార - విఘ్నేశ్ శివన్ చాలాకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా విఘ్నేశ్ .. హీరోయిన్ గా నయనతార ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగానే ఉన్నారు. ఏ మాత్రం తీరిక దొరికినా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరిగేవారు. తాజాగా నయనతార చేసిన 'నెట్రికన్' సినిమాకి విఘ్నేశ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే ఈ కథలో నయనతార అంధురాలిగా నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే విఘ్నేశ్ .. ఇన్ స్టా వేదికగా నెటిజన్లతో చిట్ చాట్ చేశాడు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చాడు. నయనతారకి ఆత్మవిశ్వాసం ఎక్కువనీ, ఆమె ఆత్మవిశ్వాసం చూసి తాను ఆశ్చర్యపోతుంటానని ఆయన చెప్పాడు. ఆమెలోని ఆ బలమైన ఆత్మవిశ్వాసమే తనకి ఇష్టమని అన్నాడు. ఆమె ఈ స్థాయిలో విజయాలను అందుకోవడానికి కారణం కూడా అదేనని చెప్పాడు. ఆమె తాజా చిత్రమైన 'నెట్రికన్' చాలా బాగా వచ్చిందనీ, ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నాడు.

Vighnesh Shivan
Nayanatara
Netrikaann movie
  • Loading...

More Telugu News