Telangana: సిద్దిపేటలో సీఎం కేసీఆర్​.. పలు భవనాల ప్రారంభం

CM KCR in Siddipet Opens Some Govt Buildings

  • ముందుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ఓపెన్ చేసిన ముఖ్యమంత్రి
  • అనంతరం పోలీస్ కమిషనరేట్ ప్రారంభోత్సవం
  • తర్వాత సిద్దిపేట కలెక్టరేట్ కు పూజలు చేసి ఓపెనింగ్

సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు పలు కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన ముందుగా సిద్దిపేట జిల్లాకు వెళ్లారు. అక్కడ ఆయన తొలుత సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ప్రారంభించారు.

అత్యాధునిక హంగులతో జీ 1తో ఎకరం విస్తీర్ణంలో కట్టిన బంగళాను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. గ్రౌండ్ ఫ్లోర్ ను ఆఫీసు కోసం, మొదటి అంతస్తును నివాసానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. అనంతరం ఆయన కొండపాక మండలం రాంపల్లి శివారులో నిర్మించిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ను ప్రారంభించారు. అక్కడ ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఆ తర్వాత అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయాలనూ ప్రారంభించారు. పూజలు చేసి వాటిని ఓపెన్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Telangana
KCR
Siddipet District
  • Loading...

More Telugu News