Andhra Pradesh: ఏపీ టార్గెట్​: ఒక్కరోజే 10 లక్షల మందికి కరోనా టీకా!

AP Starts Mega Vaccination Drive In the Bid To Vaccinate 10 lac people in a Day

  • మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన సర్కార్
  • కృష్ణా, గుంటూరు, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు లక్ష చొప్పున డోసులు
  • మిగతా వాటికి 50 వేల చొప్పున పంపిన ఆరోగ్య శాఖ

ఒక్కరోజే 8 లక్షల నుంచి 10 లక్షల మందికి కరోనా టీకాలు వేసే మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కృష్ణా, విశాఖ, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలకు లక్ష చొప్పున డోసులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పంపించారు. మిగతా అన్ని జిల్లాలకు 50 వేల చొప్పున డోసులను తరలించారు. 45 ఏళ్ల పైబడిన వారికి మొదటి డోసు టీకాను ఇవ్వనున్నారు.

వారితో పాటు వ్యాక్సిన్ వేసుకోని ఐదేళ్ల లోపు పిల్లలు కలిగి ఉన్న తల్లులకు వీలైనంత ఎక్కువ మందికి టీకా వేయాలని సర్కారు నిర్ణయించింది. మొత్తం 18 లక్షల మంది తల్లులుండగా.. ఇప్పటిదాకా వారిలో 28 శాతం మంది మొదటి డోసు టీకా తీసుకున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఇతరులకూ వ్యాక్సిన్ వేయనున్నారు. రెండో డోసు పెండింగ్ ఉన్న వారికీ టీకా ఇవ్వడానికి ప్రయత్నిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

  • Loading...

More Telugu News