మరో ప్రాజెక్టుకి ఓకే చెప్పిన యంగ్ హీరో!
- ఆది సాయికుమార్ నుంచి కొత్త చిత్రం
- దర్శకుడిగా కల్యాణ్ జీ గోగణ
- సంగీత దర్శకుడిగా సాయి కార్తీక్
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
"ఈ కథ చాలా కొత్తగా ఉంటుంది .. ఆదిసాయికుమార్ అయితే కరెక్టుగా సెట్ అవుతాడని భావించి ఆయనకు కథను వినిపించాను. కథ వినగానే ఆయన ఎంతమాత్రం ఆలోచన చేయకుండా అంగీకరించాడు. ఈ సినిమా ఆయన కెరియర్ కి తప్పకుండా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఇక ఈ సినిమాలో సునీల్ ఒక కీలకమైన పాత్రను పోషించనున్నాడు. అడగ్గానే ఆయన ఒప్పుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. త్వరలోనే షూటింగుకు వెళ్లనున్నాం. సాయికార్తీక్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది" అని చెప్పుకొచ్చాడు.