Motor vehicle Documents: వాహన పత్రాల గడువు తీరిందా.. ఏం ఫరవాలేదు!
- పత్రాల చెల్లుబాటు సెప్టెంబరు 30వరకు పొడిగింపు
- రెన్యువల్ చేయించకపోయినా చెల్లుబాటు
- కొవిడ్ నేపథ్యంలోనే నిర్ణయం
- రాష్ట్రాలకు కేంద్రం ఉత్తర్వులు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, సహా ఇతర అనుమతులకు సంబంధించిన వాహన పత్రాల చెల్లుబాటు గడువును సెప్టెంబరు 30, 2021 వరకు పొడిగించింది. అంటే ఇప్పటికే పై పత్రాల గడువు తీరినప్పటికీ సెప్టెంబరు 30 వరకు రెన్యువల్ చేయించకపోయినా చెల్లుబాటు అవుతాయి.
ఈ నిబంధనలను అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయాలని కేంద్రం సూచించింది. తద్వారా ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించాలని కోరింది. ఈ పత్రాల చెల్లుబాటు గడువును పొడిగిస్తూ ఇప్పటికే పలుసార్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.