Kaira Adwani: ఎన్టీఆర్ జోడీగా కియారా అద్వాని .. పారితోషికం 3 కోట్లు?

Kaira Adwani huge remuneration in NTR movie
  • బాలీవుడ్ లో బిజీ హీరోయిన్
  • తెలుగులోను క్రేజ్
  • ఎన్టీఆర్ జోడీగా ఛాన్స్
  • కొరటాల సినిమాకి గ్రీన్ సిగ్నల్
బాలీవుడ్ కథానాయికలలో కియారా అద్వానికి మంచి క్రేజ్ ఉంది. వరుస సినిమాలతో అక్కడ ఆమె తన దూకుడు చూపిస్తోంది. తెలుగులో కూడా ఆమెకి పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. 'భరత్ అనే నేను' సినిమాతో కియారా ఇక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఆయితే చరణ్ జోడీగా చేసిన 'వినయ విధేయ రామ' మాత్రం అభిమానులను నిరాశపరిచింది. ఈ రెండు సినిమాల తరువాతనే కియారా బాలీవుడ్ లో బిజీ అయింది. అందువల్లనే మళ్లీ తెలుగు తెరపై ఆమె కనిపించలేదు.

అయితే ఇటీవల ఆమె దక్షిణాదిన ఒక సినిమా చేయడానికి అంగీకరించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దాంతో శంకర్ - చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా చేయనుందంటూ ప్రచారం జరిగింది. అలాగే ఎన్టీఆర్ - కొరటాల సినిమాలో చేయనుందని కూడా చెప్పుకున్నారు. అయితే, ఎన్టీఆర్ జోడీగానే ఆమె కనిపించనుందనేది తాజా సమాచారం. ఈ సినిమా కోసం ఆమె అందుకుంటున్న పారితోషికం 3 కోట్లు అని అంటున్నారు. పూజ హెగ్డే .. రష్మిక తీసుకునే పారితోషికం కంటే ఇది చాలా ఎక్కువ కావడంతో హాట్ టాపిక్ గా మారింది.
Kaira Adwani
Junior NTR
Koratala Siva

More Telugu News