Asaduddin Owaisi: మోదీ సత్తా ఏపాటిదో చైనాకు తెలిసిపోయిందా?: ఒవైసీ

Owaisi comments on PM Modi over China issue

  • సరిహద్దు వెంబడి చైనా స్థావరాల విస్తరణ
  • గతంలోనూ ఆందోళన వెలిబుచ్చిన ఒవైసీ
  • మరోసారి ప్రధాని లక్ష్యంగా వ్యాఖ్యలు
  • 2014లో మోదీ వ్యాఖ్యలను ప్రస్తావించిన వైనం

భారత్ సరిహద్దుల వెంబడి చైనా అదేపనిగా స్థావరాలను విస్తరిస్తోందని గతంలోనూ ఎలుగెత్తిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి స్పందించారు. భారత్ తో సరిహద్దు పొడవునా చైనా రక్షణ స్థావరాలను వేగంగా నిర్మిస్తోందని వెల్లడించారు. రోడ్లు, ఎయిర్ పోర్టులు, సొరంగాల వంటి నిర్మాణాలు వాటిలో ఉన్నాయని వివరించారు.

"భారత కేంద్ర ప్రభుత్వం గనుక దృఢంగా ఉంటే మన పొరుగు దేశాలు తమ పంథా మార్చుకుంటాయని నరేంద్ర మోదీ 2014లో ప్రధాని కాకముందు వ్యాఖ్యానించారు. కానీ ఇప్పటికీ చైనా దూకుడు కొనసాగుతూనే ఉంది. మోదీ సత్తా ఏపాటిదో చైనాకు తెలిసిపోయిందా?" అని ఒవైసీ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఈ మేరకు సరిహద్దుల్లో చైనా నిర్మాణాలపై ఓ మీడియా కథనాన్ని కూడా ఒవైసీ పంచుకున్నారు.

  • Loading...

More Telugu News