Gautam: తెలంగాణలోని టాప్-8 స్విమ్మర్లలో ఒకడిగా మహేశ్ బాబు తనయుడు గౌతమ్

Mahesh Babu son Gautam is among the top eight competitive swimmers In Telangana

  • ప్రొఫెషనల్ స్విమ్మర్ గా ఎదుగుతున్న గౌతమ్
  • తన ఏజ్ గ్రూప్ పోటీల్లో విశేష ప్రతిభ
  • 2018 నుంచి ఈతలో ప్రావీణ్యం
  • ఫ్రీస్టయిల్ అంటే గౌతమ్ కు ఇష్టమన్న తల్లి నమ్రత

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ క్రీడారంగంలో సత్తా చాటుతున్నాడు. తన వయో విభాగంలో తెలంగాణలోని టాప్-8 స్విమ్మర్లలో ఒకడిగా నిలిచాడు. దీనిపై గౌతమ్ తల్లి నమ్రత వివరాలు తెలిపారు. గౌతమ్ తమను గర్వించేలా చేస్తున్నాడని పుత్రోత్సాహం ప్రదర్శించారు. 2018 నుంచి స్విమ్మింగ్ లో ప్రావీణ్యం కనబరుస్తున్నాడని, రాష్ట్రస్థాయిలో ప్రతిభావంతుడైన స్విమ్మర్ గా ఎదిగాడని వివరించారు. స్విమ్మింగ్ లో సహజసిద్ధంగా నైపుణ్యం సంపాదించడమే గాక, క్రీడలో కఠోరంగా శ్రమించడాన్ని ఆస్వాదిస్తున్నాడని తెలిపారు.

వేగానికి సరైన టెక్నిక్ ను జోడించి కచ్చితత్వాన్ని సాధించాడని తనయుడి ఘనతలను నమ్రత వెల్లడించారు. స్విమ్మింగ్ లోని నాలుగు ప్రధాన విభాగాలైన బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీస్టయిల్ అంశాల్లో ఎంతో సునాయాసంగా ఈదుతూ, అచ్చెరువొందిస్తున్నాడని తెలిపారు. అయితే, అన్నింట్లోకి గౌతమ్ కు ఫ్రీస్టయిల్ అంటే ఇష్టమని, 5 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల్లో నిర్విరామంగా ఈదగలడని పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News