Andhra Pradesh: కర్నూలులో అన్నదమ్ముల దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు

Brothers in Kurnool dist killed

  • మృతుల్లో ఒకరు మాజీ సర్పంచ్, మరొకరు వ్యవసాయ సహకార సంఘం సొసైటీ అధ్యక్షుడు
  • శ్మశానానికి వెళ్తుండగా కాపు కాసి దాడి
  • తొలుత బొలేరో వాహనంతో దాడి.. ఆపై నరికివేత

కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. మృతులను మాజీ సర్పంచ్ ఒడ్డు నాగేశ్వరరెడ్డి, అతడి తమ్ముడు, వ్యవసాయ సహకార సంఘం సొసైటీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డిగా గుర్తించారు. మూడు రోజుల క్రితం చనిపోయిన సమీప బంధువు సమాధి వద్దకు వెళ్తుండగా నిందితులు వారిని బొలేరో వాహనంతో ఢీకొట్టారు. అనంతరం వేటకొడవళ్లతో నరికి చంపారు.

ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh
Kurnool District
Murder
  • Loading...

More Telugu News