YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసు.. విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
- రాంకీ కేసులో ఎ-2 నిందితుడిగా విజయసాయిరెడ్డి
- తనను అక్రమంగా ఇరికించారన్న వైసీపీ నేత
- విచారణను 23కు వాయిదా వేసిన కోర్టు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి నిన్న సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. రాంకీ కేసులో ఎ-2 నిందితుడైన విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌లో వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా విజయసాయి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ కేసులో విజయసాయిని అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇదే కేసులో ఇతర డిశ్చార్జ్ పిటిషన్లతోపాటు జగతిలో పెట్టుబడులు, వాన్‌పిక్ కేసులపై ఇతర విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. అలాగే, ఎమ్మార్ వ్యవహారంపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది.