Naga Chaitanya: కుదిరితే జులై .. లేదంటే ఆగస్టుకు 'లవ్ స్టోరీ'

Love Story is going to release soon

  • శేఖర్ కమ్ముల నుంచి 'లవ్ స్టోరీ'
  • 'ఫిదా' తరువాత సాయిపల్లవితో
  • 'సారంగధరియా'కు మంచి రెస్పాన్స్
  • త్వరలోనే థియేటర్లకు

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య - సాయిపల్లవి జంటగా 'లవ్ స్టోరీ' రూపొందింది. పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఇంతకుముందే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గుతూ వస్తుండటంతో, త్వరలో థియేటర్లు తెరిచే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుచుకున్న రెండు వారాలకుగానీ .. లేదంటే ఆగస్టులో గాని విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది.

ఈ విషయంలో త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఇది 'ఫిదా' తరువాత శేఖర్ కమ్ముల - సాయిపల్లవి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అందరూ ఆసక్తితో ఉన్నారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన 'సారంగధరియా .. ' సాంగ్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఒక రకంగా ఇది ఈ సినిమాపై అంచనాలను పెంచేసిన సాంగ్. ఈ సినిమాలో చైతూ .. సాయిపల్లవి మధ్య ఏ స్థాయిలో కెమిస్ట్రీ వర్కౌట్ అయిందో చూడాలి. 'ఫిదా' సెట్ చేసిన రికార్డులను కొల్లగొడుతుందో లేదో చూడాలి.

Naga Chaitanya
Sai Paallavi
Sekhar Kaammula
  • Loading...

More Telugu News