Anand Devarakonda: సమంత చేతుల మీదుగా 'పుష్పక విమానం' సాంగ్

- ఆనంద్ దేవరకొండ నుంచి మరో చిత్రం
- నూతన కథానాయికగా గీత్ శైనీ పరిచయం
- ముఖ్యమైన పాత్రలో సునీల్
- 18వ తేదీన లిరికల్ సాంగ్ రిలీజ్
ఆనంద్ దేవరకొండ ... గీత్ శైనీ జంటగా 'పుష్పక విమానం' సినిమా రూపొందింది. ఈ సినిమా ద్వారా దామోదర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. విజయ్ దేవరకొండ సొంత బ్యానర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. త్వరలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. దాంతో ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. అందులో భాగంగా ఆల్రెడీ 'సిలకా' అనే లిరికల్ వీడియోను వదిలారు. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
