VH: కల్నల్ సంతోష్ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషమే కానీ అంబేద్కర్ ఏం పాపం చేశారు?: వీహెచ్

VH responds on Ambedkar statue issue

  • అంబేద్కర్ విగ్రహం అంశంపై వీహెచ్ స్పందన
  • జై భీమ్ కార్యకర్తలను అధికారులు అడ్డుకున్నారని వెల్లడి
  • విగ్రహ ఏర్పాటుకు తాము కూడా ప్రయత్నించామన్న వీహెచ్
  • ఈ నెల 17న రౌండ్ టేబుల్ సమావేశం

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అంశంపై స్పందించారు. కల్నల్ సంతోష్ కుమార్ విగ్రహం ఏర్పాటు తమకు కూడా హర్షణీయమేనని, కానీ అంబేద్కర్ ఏం పాపం చేశారని వీహెచ్ ప్రశ్నించారు. 2019లో జై భీమ్ కార్యకర్తలు పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం నెలకొల్పే ప్రయత్నం చేయగా, మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారని వివరించారు. మరోసారి విగ్రహం ఏర్పాటుకు తాము ప్రయత్నిస్తే గోషామహల్ పోలీస్ స్టేషన్ లో పెట్టారని వీహెచ్ ఆరోపించారు.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్-3 వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం కోసం సమైక్య పోరాటం చేస్తామని వెల్లడించారు. తాను ఇప్పటికే ఈ విషయమై ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, అసదుద్దీన్ ఒవైసీ, ఎల్.రమణ, చాడ వెంకట్ రెడ్డిలతో చర్చించానని, దీనిపై ఎల్లుండి రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుందని వీహెచ్ తెలిపారు.

VH
Ambedkar Statue
Punjagutta
Hyderabad
Round Table
Telangana
  • Loading...

More Telugu News