Kadapa District: కడప జిల్లాలో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి!

ycp leader suicide after shot dead a man in kadapa
  • పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో ఘటన
  • ఆస్తి వివాదాలే కారణమని ప్రాథమిక నిర్థారణ
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆస్తి తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తి మరో వ్యక్తిని కాల్చి చంపి ఆపై తాను కూడా అదే తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ప్రసాద్‌రెడ్డి లైసెన్స్ కలిగిన తన తుపాకితో తన బంధువు పార్థసారథిరెడ్డిని కాల్చి చంపాడు. అనంతరం అదే తుపాకితో ప్రసాద్‌రెడ్డి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్తి వివాదాలే ఇద్దరి మధ్య గొడవలకు కారణమని అనుమానిస్తున్నారు. ఇరు కుటుంబాల వారూ వైసీపీకి చెందిన వారేనని తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Kadapa District
Pulivendula
YSRCP
Murder

More Telugu News