Corona Virus: ఏపీలో కొత్తగా 6,952 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Corona second wave health bulletin

  • ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం
  • గత 24 గంటల్లో 1,08,616 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 1,199 కొత్త కేసులు
  • రాష్ట్రంలో 58 మరణాలు
  • ప్రకాశం జిల్లాలో 11 మంది మృతి

ఏపీలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేణా దిగివస్తోంది. గడచిన 24 గంటల్లో 1,08,616 కరోనా పరీక్షలు నిర్వహించగా... 6,952 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,199 కొత్త కేసులు వెల్లడి కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 1,167 కేసులు గుర్తించారు. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 228 కొత్త కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 11,577 మంది కరోనా నుంచి కోలుకోగా, 58 మరణాలు సంభవించాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 11 మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో 9 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18,03,074 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 16,99,775 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 91,417 మందికి కరోనా చికిత్స జరుగుతోంది. అటు, మొత్తం మరణాల సంఖ్య 11,882కి చేరింది.

Corona Virus
Bulletin
Second Wave
Andhra Pradesh
  • Loading...

More Telugu News