Madhavan: రామ్ సినిమాలో నటించడంపై మాధవన్ వివరణ

Madhavan clarifies he is not part of Rams movie

  • లింగుస్వామి దర్శకత్వంలో రామ్ 
  • కథానాయికగా కృతి శెట్టి ఎంపిక
  • మాధవన్ విలన్ అంటూ వార్తలు
  • అందులో వాస్తవం లేదన్న మాధవన్

ఇటీవలి కాలంలో మన సినిమాలకు సంబంధించి అనేక పుకార్లు వస్తున్నాయి. ఫలానా సినిమాలో ఫలానా ఆర్టిస్టు ఎంపికయ్యారంటూ ఈవేళ ఓ వార్త రావడం.. మర్నాడే సదరు ఆర్టిస్టు దానిని ఖండిస్తూ, నేను అందులో నటించడం లేదంటూ చెప్పడం పరిపాటి అయిపోయింది. తాజాగా తమిళ కథానాయకుడు మాధవన్ కూడా అలాంటి ఖండనతో కూడిన వివరణ ఒకటి ఇచ్చాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే, ఎనర్జిటిక్ హీరో రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ మాస్ మసాలా చిత్రాన్ని చేస్తున్నాడు. కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం సాగుతున్నాయి. కొవిడ్ ఉద్ధృతి తగ్గగానే షూటింగ్ మొదలెడతారు. ఇక ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రకు మాధవన్ ను తీసుకున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మాధవన్ తాజాగా దీనిపై స్పందించాడు. "వండర్ ఫుల్ దర్శకుడు లింగుస్వామి సినిమాలో నటించాలని నాకూ ఎంతగానో వుంది. అయితే, ఆయన చేస్తున్న తెలుగు సినిమాలో నేను విలన్ గా నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలలో మాత్రం వాస్తవం లేదు" అంటూ ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చాడు మాధవన్.

Madhavan
Ram
Lingusamy
Kruti Shetty
  • Loading...

More Telugu News