Vijay Sai Reddy: ఈ లింకేంటో త్వరలోనే తేలుతుంది: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai reddy slams tdp

  • టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ 56 ఎకరాల  భూమిని మింగేశాడని తేలింది
  • పచ్చ గెద్దలు విశాఖలో భూముల్ని ఎలా తన్నుకుపోయారో అర్థం చేసుకోవచ్చు
  • విశాఖ భూ ఆక్రమణలపై మాట్లాడితే బెజవాడ కరకట్ట కొంపలో భూకంపం  

టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆరోప‌ణ‌లు చేశారు. 'టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఒకేచోట 56 ఎకరాల ప్రభుత్వ భూమిని మింగేశాడని తేలింది. పచ్చ గెద్దలు విశాఖలో భూముల్ని, కొండల్ని, కాలువల్ని, గెడ్డల్ని ఎలా తన్నుకుపోయారో అర్థం చేసుకోవచ్చు. విశాఖ భూ ఆక్రమణలపై మాట్లాడితే బెజవాడ కరకట్ట కొంపలో భూకంపం వస్తోంది. ఈ లింకేంటో  త్వరలోనే తేలుతుంది' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

టీడీపీ నేత‌ చంద్ర‌బాబుపై కూడా విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. 'అమరావతి పేరుతో దేశంలో చాలా పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. వాళ్లంతా బాబు రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతికి మద్ద‌తివ్వాలట! ఎల్లో మీడియా ఆ పనిలో పడింది. రాజధాని పేరుతో లక్షల కోట్ల దోపిడీకి స్కెచ్ వేసిన బాబుకు కిరాయి ఉద్యమాన్ని ఎటు తీసుకుపోవాలో అంతుబట్టడం లేదు' అని విజ‌యసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Vijay Sai Reddy
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News