Biophore: హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్ నుంచి కరోనాకు మరో ఔషధం.. డీజీసీఐకి దరఖాస్తు

Biophore seeks approval for Aviptadil from drug controller for emergency use in COVID

  • అవిప్టాడిల్ అనే ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంస్థ
  • క్లినికల్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు
  • కరోనా బాధితులు త్వరగా కోలుకుంటారన్న బయోఫోర్

హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ నుంచి కరోనాకు కొత్త ఔషధం రాబోతోంది. కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు ఈ సంస్థ అవిప్టాడిల్ అనే ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఔషధ వినియోగ అనుమతుల కోసం భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి కోరింది.

 తాము అభివృద్ధి చేసిన వాసోయాక్టివ్ ఇంటెస్టినల్ పెప్డైడ్ (వీఐపీ) అయిన అవిప్టాడిల్‌తో కరోనా బాధితులు త్వరగా కోలుకుంటారని బయోఫోర్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధానికి నిర్వహించిన క్లినికల్ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని సంస్థ సీఈవో డాక్టర్ జగదీశ్ బాబు తెలిపారు. ఇదే కంపెనీ గతంలో ఫావిపిరావిర్ ఔషధాన్ని తీసుకొచ్చింది.

  • Loading...

More Telugu News